Wednesday, November 17, 2010

పలాన వాళ్ళ అమ్మాయి

రాత్రి 8:30,9:00 మద్యలో టైం అయ్యింది. పొన్ చేసిన ఫ్రెండ్స్ అందరూ వచ్చేసారు. ఎవరో ఒకళ్ళిద్దరు శ్రమజీవులు తప్ప. మా అందరిది ఒకే ఊరు, ప్రతీ వీకెండ్ లో ఒకసారి ఏదో అకేషన్ కల్పించుకుని ఎవడొ ఒకడి రూంలొనో,లేక బయటో కలుస్తుంటాం. అందరికి నేనే కాల్ చెశానేమో మందు సరంజామా అంతా నా భుజస్కందాల పైన పడింది. అంతా సర్దుకుని డాభా మీద కూర్చున్నాం.ఊరు వెళ్ళి వచ్చిన నేను ఏమి చెప్తానో అని అంతా నా వైపు క్యురియాసిటితో చూస్తున్నారు . నేను తలో పెగ్ మందు పొసి వాళ్ళ ముందు కుర్చుని తాగడం ప్రారంభించాను .ఇంతలొ మా భావ ఒకడు "ఒరెయ్ టెన్షన్ తొ చచ్చిపొతున్నాం ఫొన్లొ చెప్పమంటె చెప్పలెదు ఇక్కడికొచ్చాక డల్ గా కుర్చున్నావ్ .ఏమయ్యిందొ చెప్పరా" అన్నాడు. పక్కూళ్ళో పలానా వాళ్ళ అమ్మాయి లేచిపొయింది కదా మళ్ళి తిరిగివచ్చింది అని చెప్పాను.అంతే మా వాళ్ళంతా షాక్ తిన్నారు.అందుకే నేను ఫొన్లొ చెప్పలేదు.ఎంత ఫీలయ్యారంటే ఒక్కొక్కడి కళ్ళల్లో నీళ్ళు. ఇంతలొ మా బావ "నీయబ్బ లేచిపొవడం ఏంట్రా స్వేచ్చ కోరుకుని వెళ్ళింది" నచ్చక తిరిగి వచ్చుంటుంది అని. అవునవును పంజరంలొ చిలక స్వేచ్చ కోరుకుంటే భూమి మీదకి వెళ్ళి, కావాలంటే మళ్ళి పంజరంలొనికి వస్తుంది. పోయేదిఏమి లేదు.కాని భూమి మీద స్వేచ్చగా వున్న చిలక వెళ్ళి మళ్ళి పవిత్రంగా తిరిగి వస్తుందా. మా వాళ్ళంతా ఎవడికి వాడే సర్దిచెప్పుకుంటున్నాడు.కానీ మాబావ తీసుకువచ్చిన ఫ్రెండ్ మాత్రం నా మొహం వైపు చూస్తున్నాడు.ఒక అమ్మాయి ప్రేమించి వెళ్ళిపొయి మళ్ళీ ఒంటరిగా తిరిగి వస్తే వీళ్ళెందుకు ఇంత ఫీల్ అవ్వుతున్నారా అని . ఇంక ఎప్పుడైనా అడిగెవాడు కాదు,కానీ కొంచం ఔషదం తాగాడు కదా,నా పక్కకి సైలెంట్ గా వచ్చి అడిగాడు "సార్ ఆ అమ్మాయి ఎవరు"అని.ఇంకెప్పుడైనా అయితె లైట్ తీస్కొ బ్రదర్ అనే వాడిని కానీ ఔషదం నా మీద కూడా పనిచేస్తుండటంతో వెన్నెల్లో ఒంటరిగా చెప్పడం ప్రారంభించా .

అనగనగనగా ఒక రాజు గారు,ఏడుగురు కొడుకుల్లేరు కాని ఒక్కత్తె కూతురు.అంతా ఆయన్ని మీసాల రాజు గారు అంటారు,కాని మీసాలని చూసిన గుర్తు నాకు లేదు. ఎప్పుడు చూసినా పేడు మూతే,ఏమయ్యాయి అంటే కూతురు పుట్టాక తీసెసాడు అంటారు. అంతకముందు కొబ్బరి తోటల్లోనో,చెరువు గట్ల మీదో చాలా మంది ఆడోళ్ళు చెప్పెవారంట "రాజు గారు మీసాలు గుర్చుకుంటున్నాయి తీసెయ్యకూడదా" అని .మొగోడి పౌరుషం మీసం చూస్తేనె తెలుస్తుంది ఉచితసలహాలు ఇవ్వకుండా పొడుకో అనే వాడంట. కానీ కూతురు నాన్నా మీసాలు గుచ్చుకుంటున్నాయి అని ముద్దు ముద్దుగా అనగానే తీసెసాడంట.అప్పట్నుంచి మా వూళ్ళొ ఆయన మీసాలు చూసిన వాళ్ళు లేరు. ఈయనకి కూతురు చాలా లేటుగా పుట్టింది.రాజుగార్లో ఏలోపం లేదని వూళ్ళో చాలా మంది ఆడాళ్ళకి తెలుసు, ఏ వాళ్ళకి ఎలా తెలుసు అంటావా. చెప్తె వాళ్ళ మొగుళ్ళు చంపెయ్యరూ….మొత్తానికి లేటుగా ఐనా అందగత్తె పుట్టింది. ఆ వూళ్ళో అందరి పురుళ్ళు చూసిన మంత్రసాని,పురుడు పొసాక బయటకి వచ్చి వూళ్ళో నాలుగు రోడ్ల మద్య చెప్పిందంట,పిల్ల మంచి అందగత్తె అని. ఆ ,పిల్లలు దేవుళ్ళతో సమానం అంటారు పుట్టగానే అందరు పిల్లలు అలాగె వుంటారు అనుకునేవారు, వేరే ఎవరి పిల్ల ఐనా ఐతే,కానీ రాజు గారి అందం గురించి తెలవడం వల్ల, అంతా నిజమే గామోసు అనుకున్నారు . మన బాషలో చెప్పాలంటే రాజుగారు బాగా సౌండ్ పార్టీ
ఒకప్పుడు.అంటే బాగా డబ్బున్నోడు ఎంత వున్నోడంటే, చుట్టుపక్కల నాలుగువైపులా వున్న నాలుగు వూళ్ళ నుండి వాళ్ళ వూరి దాకా వున్న అన్ని ఆయనవే.అవి చెరువులయినా,కొబ్బరి తోటలయినా.ఈయన కామ పొషన వల్ల వున్న మూడు వైపులా పోగా ,కూతురు పుట్టడం వల్ల ఒక వైపు మిగిలింది.తక్కువలొ తక్కువగా 400 ఎకరాలు. అంతకు ముందయితే వ్యవసాయం చెసేవాడే, కానీ కూతురు పుట్టాక అంతా కౌలుకి ఇచ్చేసి కూతురే లోకంగా బతుకున్నాడు.

ఆ పిల్లకి అన్ని ఆడంబరంగానే జరిగేవి.21వ రోజు దగ్గర్నుండి పూర్ణిమ అని పేరు పెట్టడం వరకు . లెక్కా పత్రం వుండదు.ఒక్క ఖర్చు తప్ప.

పిల్ల ఎప్పుడు చూసినా ఆయన భుజం మీదే వుండేదంట.కిందకి దింపక పోతే నడక రాదని ఎవరో చెప్పడంతో ,కిందకి దింపేవాడంట. కానీ ఇంత ప్రేమగా చూసుకునే తండ్రి వుంటే ఏ పిల్లలు మాత్రం వదుల్తారు,ఆ పిల్ల కూడా కిందకి దిగేదికాదంట. పూర్ణిమని స్కూల్లో జాయిన్ చేసారు.పూర్ణిమ స్కూల్ కి వెళ్ళగానే బయట కూర్చున్నాయన లోపలికి వచ్చేది,పూర్ణిమ వచ్చాకే.మద్యలో ఒకసారి బోజనానికి లోపలికి వెళ్ళేవాడు.కాఫీలు గట్రా అన్ని బయటే. అందరూ రాజుగారికి ఇల్లరికం వచ్చే అల్లుణ్ణి నెతకాలనేవారు,ఆయన కూడా,అవునవును లేకపొతే నా బంగారాన్ని బయటకు పంపుతానా అనేవాడంట.
పూర్ణిమకి 12సంవత్సరాలు,కొంచం అటుఇటుగా.పెద్దదైంది.బోజనాలు పెట్టారు.ఎంతమంది తిన్నారో లెక్కపెడదాం అనుకునే వాళ్ళు వరసగా అన్ని అంకెలు లెక్క పెట్టలేక వదిలేసారు. జనం కూర్చుని లెగుస్తున్నారు.ఆ వూరె కాదు చుట్టు పక్కల అన్ని వూళ్ళు. కొంతమంది మగాళ్ళు అనుకుంటున్నారు,ఆడ పిల్లలు చిన్నప్పుడు ఎంత ఇదిగా వున్నా పెద్దైయ్యాక తల్లితోనే మసులుకుంటారు అని.అలా అనుకున్నది రాజుగారు వింటే తట్టుకోగలడా,ఇంకా నయం విన్లేదు.
కానీ ఈ పిల్ల ఎప్పుడూ తండ్రితోనే వుండేది. ఆమద్య కాలంలో పండక్కి మెమంతా కలిసి వూరెళ్ళాం.ఎప్పటిలాగే మేము పూర్ణిమని చూద్దాం అని వాళ్ళ వూరెళ్ళాం.అంతకుముందు చాలాసార్లు చూసినా, మాకు కొత్తగానే వుండేది.ఆ అమ్మాయిని ఎవడికివాడే గుండెల్లో దాచుకుని తిరిగివచ్చాం . తెల్లతోలే అందం అనుకునే మాకు ఇంత అందగత్తె కనిపిస్తె ఎలా తట్టుకోగలం.ఎవడికివాడే మా గర్ల్ ఫ్రెండ్స్ ని తిట్టుకొవడం తప్ప ఏం చెయ్యగలం.
చుట్టుపక్కల ప్రతీ వూళ్ళో పందాలు జరిగేవి.పూర్ణిమని ఎదురు కట్నం ఇచ్చి పెళ్ళి చేసుకుంటారు అని.ఏమో ఇవ్వచ్చు ,వున్నది ఒక్కతె కూతురు ఎప్పుడైన కూతురుదేగా.పదవతరగతి,ఇంటర్ వరకు మాపక్క వూళ్ళో వున్నాయి కాని ఆపై చదువులకి వేరే వూరు పంపడం రాజుగారికి కూడా తప్పలేదు. రాజుగారి కూతురు ఇంజనీరింగ్ చదివి ఉద్యొగం చెయ్యాలా ,ఊళ్ళు ఏలాలా .పిల్లని పక్కూరు పంపడు అనుకున్నారు.కాని ఆడపిల్ల చదువుకుంటే మంచిదని ఇంజనీరింగ్ లొ జాయిన్ చెసాడు. పూర్ణిమ జీవితంలొ స్వేచ్చ మిస్ అవ్వకూడదని కాలేజ్ బస్సులొనే పంపెవాడు.రోజూ సెంటర్ లో కాలేజ్ బస్సు ఎక్కించి,మళ్ళీ బస్సు వచ్చే టైంకి రోడ్డు మీద వుండేవాడు. అప్పుడప్పుడు రాజుగారి బార్య అంటావుండేదంట,రేపొ మాపొ బయటకు వెళ్ళాల్సిన పిల్ల మీద మరీ అంత ప్రేమ మంచిదికాదు,అని.ఆయన ఎప్పుడు చెప్పినట్టే చెప్పాడంట,నోర్మూసుకో అని.

పురుట్లొ ఆడపిల్లల్ని చంపడం వల్ల ఏమో.దేశంలో ఆడపిల్లలు తక్కువయ్యిపోయారు. క్లాస్ లొ కూడా 50మంది అబ్బాయిలు ఉంటె 30మంది ఆడాళ్ళు ఉంటున్నారు.ఉన్న 30మందిలొ అందగత్తె కాబట్టి క్లాస్ లొ ,పక్క క్లాస్ లొ, పక్క కాలేజ్ లొ,పక్కూరి కాలేజ్ లొ అందరి కళ్ళు పూర్ణిమ మీదే వుండేవంట. ఒక్కొక్కడు సీరియస్ గా స్వేచ్చనిద్దాం అని,సారీ అదే ప్రేమిద్దాం అని 2,3 నెలలు వెనక తిరిగి పూర్ణిమ చూడకపొతె,పూర్ణిమ పక్కనున్న అమ్మాయిలు వాళ్ళ కోసం అని ఫీలయితె ,వాళ్ళతొ అడ్జెస్ట్ అయ్యిపోయేవాళ్ళంట. కానీ ఒక్కడు మాత్రం అడ్జెస్ట్ అవ్వలేదు.పేరు దాసు,ఉన్నోడు కాదు,లేనోడు కాదు.రోజులు గడుస్తాయి,నెలలు గడుస్తాయి,కానీ పెద్ద కష్టం వస్తే మాత్రం కుటుంబం అంతా రోడ్డు మీదే ఉంటారు. వీడు పూర్ణిమ చుట్టూ రెండు సంవత్సరాలు తిరిగి,ఇంక లాభం లేదు చూడట్లేదు అని,మూడో సంవత్సరం మూడో నెల ఎదురుపడ్డాడు.


నాపేరు దాసు అన్నాడు ,అవునా కొత్తగా జాయిన్ అయ్యారా అంది.అలాంటావేంటి ఎప్పట్నించో నీవెనకాల తిరుగుతున్నాను,ఐ లవ్ యు అన్నాడు.లేదు నాకు ఇష్టం లేదు,మా నాన్న గారు ఎవర్ని చేసుకోమంటే వాళ్ళనే చేసుకుంటాను అందంట.
వాడేమి మాట్లాడకుండా వెళ్ళిపొయాడంట.అబ్బాయిలు అందరూ నిన్నె చూస్తున్నారు అని స్నేహితులు అంటే, ఏమిటో అనుకుంది గాని పూర్ణిమ కూడా ఈ రోజు కొత్త గానె ఉంది. అప్పట్నించి పూర్ణిమ ఎప్పుడు కనపడినా తలదించుకు వెళ్ళి పోయెవాడంట దాసు.మద్యాహ్నం లంచ్ బాక్స్ ఎప్పుడూ డస్ట్ బిన్ లోనే పాడేసేవాడంట.కానీ కేంటిన్ లొ తింటున్నాడని వీళ్ళాకేం తెలుసు.పూర్ణిమ కాలెజ్ కి వెళ్ళేది వచ్చేది ఏ మార్పులేదంట. కాని ఎప్పుడూ తోక మిత్రులు తోడు ఉంటారు కదా.పూర్ణిమా చూడవే పాపం వాడు తినడం లేదు,చదవడం లేదు అనే వారంట . రోడ్డుమీద అడుక్కునే వాళ్ళకి కడుపునిండా పెట్టే కుటుంబం నుండి వచ్చిన అమ్మాయి,ప్రేమిస్తున్నానని చెప్పిన అబ్బాయి తినట్లెదు అంటె మనసు ఊరుకుంటుందా,మద్యాహ్నం లంచ్ అవర్ లొ తన బాక్స్ వాడికి ఇచ్చి తినమంది. వీడు అందరిలాటి వెదవే అని తెలుసుకోవడానికి ఆ అమ్మాయి చెసిన ఎఫైర్లు లేవు,విన్నవి తప్పితె.మొత్తానికి దాసు గాడు కిందా మీదా పడితే ,మొదట జాలితొ మాట్లాడింది కాస్తా ,నవ్వుతూ రోజూ మట్లాడటం స్టార్ట్ చేసింది. ఒక రోజు నువ్వు మాట్లాడుతుంటే మానాన్నలా ఉంది అనేది,ఇంకో రోజు నీ నవ్వు మా నాన్నలా ఉంటుంది అనేదంట. అమ్మాయిలు ఒక్కసారి అబ్బాయిల్ని తండ్రితో పోల్చారంటే లైన్ క్లియర్ అయ్యిపోయినట్టే.అయినా వయసు ఆకర్షనలో గుడి సందులో బేమ్మర్లు అయినా ఒక్కటే,వెనక సందులో భోగం వాళ్ళయినా ఒక్కటే. ఈ అమ్మాయి కూడా వయసులో ఉన్నదే కదా. కాలేజ్ ఉన్నంత సేపు చూపులు ఆడుకునేవి,మొహం మీద నవ్వు చెరిగేది కాదంట.





రాజు గారు సంబందాలు చూస్తునారు ,ఆ వూళ్ళో,ఈ వూళ్ళో,పక్కూళ్ళో.మొత్తానికి ఆయనకి నచ్చిన క్వాలిటీస్ అన్నీ ఉన్న కుర్రాడు దొరికాడు.ఇంతలో ఎవరు ,ఎక్కడ చూసి చెప్పారో గాని పూర్ణిమ ఎవరో అబ్బాయిని ప్రేమిస్తున్న విషయం చెప్పారు. నా కూతురు నాకు చెప్పదా,మా మద్యలొ దాచుకునే విషయాలు ఏమి ఉండవు.తననే అడుగుతాను అన్నాడంట.పూర్ణిమ కాలేజ్ నుండి రాగానే ,అమ్మా నీకొసం సంబందాలు చూస్తున్నాం,ఎవర్నయినా ఇష్టపడితే చెప్పు అన్నాడు. కానీ ఈ అమ్మాయి కూడా అందరి ఆడపిల్లల్లాగానే ,లేదు నాన్నా అందంట.బయం లేదమ్మా నీకన్నా నాకు ఏది ముఖ్యం కాదు అన్నాడు.మళ్ళీ లేదు నాన్నా అందంట.ఆయన కూడా చూసిన వాడు తప్పు చూసాడేమో,నా కూతురు నాదగ్గర ఏమి దాచదు అనుకుని,పెళ్ళి ముహుర్తాలు పెట్టించేశాడంట. పూర్ణిమ రోజూ కలేజ్ కి వెళ్తుంది.పెళ్ళి రోజు వచ్చేస్తుంది.నేనేం చెయ్యను అన్నాడు దాసు.రేపే పెళ్ళి, ఊరంతా ఒకటే హడావుడి.కొన్ని సంవత్సరాలంత కౌలంతా ఈ రెండ్రోజుల్లోనే అయ్యిపొతుంది. చుట్టాలు,తెల్సినవాళ్ళు తెలియనివాళ్ళు అంతావచ్చేసారు.ఎవరికిఎవరు పనులు పురమాయిస్తున్నారో తెలవట్లేదు.కానీ ఎక్కడా ఏపని ఆగట్లేదు.విస్తట్లో రాజుల ఇంట్లో పెట్టే బూర్లు దగ్గర నుండి గడ్డపెరుగు దాకా ,పెళ్ళయ్యాక వచ్చిన చుట్టాలకి పంచడానికి పిండివంటలతో సహా అన్నీ రడీ అయ్యిపొయాయి.విడిదిల్లు ముచ్చటగా సిద్దమైంది.అందరి ఊహా పెళ్ళిబట్టల్లో పూర్ణిమ ఎలా ఉంటుందనేదే.
ఇంట్లో నిద్రపొయిందనుకున్న పిల్ల గడప దాటి చాలాసేపయ్యింది. అక్కడ్నుండి ఊళ్ళు దాటి దాసు దగ్గర ఉంది.బయంగా లేదా అన్నాడు దాసు,లేదు నువ్వు మానాన్నలా చూసుకుంటావన్న నమ్మకం ఉంది అందంట. దాసు వాళ్ళింటికి తీసుకువెళ్ళ్డాడు,మా కుటుంబాల్లో ఇలాంటివి సహజమే అన్నట్టు,ఎవరు ఏమి అన్లేదు. వాళ్ళ ఇల్లు వీళ్ళ గొడ్లసావిడి కన్నా కొంచం కాదు ,చాలా చిన్నది.



పూర్ణిమ విషయం ఇంట్లొ తెలిసింది.వూళ్ళో అందరికి తెలిసింది.రాజుగారికి ఎవరు మొహం చూపించలేకపోతున్నారు.వంటోళ్ళు వంటలు ఆపేసారు,ఇంక ఎవరు తింటారు.పనోళ్ళు అన్ని బయట పడేస్తున్నారు. ఈయన మాత్రం ఎవరితోను మాట్లాడలేదు.ఆ తరవాతి రోజు మాత్రం సెంటర్ కి వచ్చి కూర్చున్నాడు.వచ్చే బస్సు వెళ్ళేబస్సు చూస్తావుండేవాడంట. 2నెలలు గడిచింది.ఇప్పటిదాక రాజుగారి మీసం చూడని వాళ్ళు ,గడ్డంలొ కలిసిపొయిన మీసంతొ రాజుగారిని చూస్తుంటే బాదగా ఉండేది. ఇంట్లో పెళ్ళాం గురుంచి ఈయనికి ఎప్పుడు పట్టింపేలేదు.

మరో పక్క ,దాసు పక్కలో పడుకుంటున్నాడు,బయటకు వెళ్ళొచ్చి మళ్ళీ పక్కలో పడుకుంటున్నాడు,అని తప్ప పూర్ణిమ కి ఏమి తెలవట్లేదు.ఏదో ఒక చిన్న ఉద్యొగం చేస్తున్నాడంట.2నెలల్లొ కిరాణా కొసం ,తరవాత సంత కోసం బయటకు వచ్చింది.తండ్రి ఎప్పుడయినా బయటకు పంపితేగా .వేడి తొలిగాక తండ్రి ప్రేమ గుర్తుకు వచ్చింది.దాస్ కూడ బాగా మారిపోయాడంట.మీ నాన్న దగ్గరకి వెళ్ళి డబ్బులు తీసుకురా ,అనేవాడంట.ఏ మొహం పెట్టుకుని వెల్తుంది.వయసు పొంగులు వంగాక వాళ్ళిద్దరి మద్యన ఏమి జరిగినా మనకి అనవసరం కానీ ,పూర్ణిమ కి అన్ని కష్టాలేనంట. రాజుగారికి అమ్మాయి ఎక్కడ ఉంటుందో తెలిసినా వెళ్ళేవాడు కాదు,ఏమి మాట్లాడెవాడు కాదు.మొత్తానికి సంవత్సరం అయ్యింది.ఉళ్ళో ఎవరెవరో చెప్పుకోగా చివరికి తెలిసాయి ,రాజుగారికి అమ్మాయి పడెకష్టాలు. పెద్దమనుషులని పంపి పూర్ణిమని ఇంటికి తీసుకొచ్చేసాడు.దాసు గాడు అక్కర్లేదన్నాడంట.వాళ్ళ ఇంట్లొ మా లేబర్ కుటుంబాలు ఇంతే అన్నట్టు మాట్లాడారంట.మొత్తానికి చిలక ఇంటికి వచ్చింది ,అపవిత్రంగా. నేను ఇంకొ పెగ్ తాగుతా వుంటే ,చాలా తొందరగా అన్నాడు,మళ్ళి తండ్రి కూతుళ్ళు పూర్వం లాగానె వున్నారా అని.నెను గ్లాస్ పక్కన పెట్టి చెప్పడం స్టార్ట్ చేసా.లేదు,అప్పట్నుంచి ఆ కుటుంబం లొ,దసరా వస్తుంది,దీపావళి వస్తుంది,సంక్రాంతి,ఉగాది వస్తునాయి.


రాజుగారు ఒక్కమాటా మాట్లాడేవాడుకాదంట.పండక్కి బట్టలు కొనుక్కున్నవా అమ్మా అని తప్ప.అమ్మాయి నాకెందుకు నాన్నా ,అంటె ఎవర్నయినా పంపి తెప్పించేవాడంట.
మద్యలో ఒకసారి అడిగాడంట ,ఏమ్మా పెళ్ళి చేసుకుంటావా అని.వద్దు నాన్నా ,మీతోనె వుంటాను అందంట .వయసు ఆకర్షణ పొయింది.పాపం సార్ పెద్దింటి అమ్మాయి వయసు ఆకర్షణలో తప్పు చేసింది,జీవితాంతం అనుబవించాలి,అన్నాడు బావగాడి ఫ్రెండ్ .అవును బాసు అన్నాను నేను.రాజు గారు కూడా సంబందాలు ఏమి చూడట్లేదు,తరువాత కూతుర్ని చులకనగా చూస్తారని బయం. అందరికీ తెలుసు వీళ్ళ గురుంచి బాద పడటం తప్ప ఎవరు ఏమి చెయ్యగలరు.ఆ అమ్మాయి కి అర్దం చేసుకునే అబ్బాయి దొరికితే ఎంత బాగుంటుంది సార్ అన్నాడు.వుంటారంటారా ఎక్కడయినా.

Taken from http://ctharamaraju.wordpress.com/